ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్
ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ జగిత్యాల జిల్లాలో మొత్తం (03) ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్లు మరియు ఒక జిల్లా టాస్క్ ఫోర్స్ ఉన్నాయి. అవి జిల్లా మధ్య నిషేధ మరియు అబ్కారి అధికారి గారి సమక్షంలో పని చేస్తాయి.
ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ యొక్క కార్యకలాపాలు గుడుంబా నిర్మూలన, అక్రమ మద్యం, కల్తీ మద్యం మరియు కల్తీ కల్లును అరికట్టడం.
జగిత్యాల జిల్లా లో మొత్తం (64) మద్యం షాపులు, (16) బార్ & రెస్టారెంట్లు మరియు (300) కల్లు దుకాణములు ఉన్నాయి.
- 2015 – 16 నుండి 2019-20 వరకు మద్యం షాపులు మరియు బార్ & రెస్టారెంట్ల ద్వారా ప్రభుత్వమునకు లైసెన్సు ఫీజు రూపములో వచ్చిన ఆదాయము ( రూపాయలు కొట్లలో)
సంవత్సరము మద్యం షాపులు బార్ & రెస్టారెంట్లు
2015-16 27.89 04.55
2016-17 27.89 05.46
2017-18 31.20 06.30
2018-19 31.20 06.83
2019-20 36.20 06.83
- 2016-17 నుండి 2018-19 వరకు మద్యం షాపులు మరియు బార్ & రెస్టారెంట్ల ద్వారా మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వమునకు సమకూరిన ఆదాయము ( రూపాయలు కొట్లలో)
సంవత్సరము అమ్మకపు విలువ
2016-17 337.16
2017-18 417.17
2018-19 482.24
- ఎక్స్ గ్రేషియా :
ఇట్టి ఎక్స్ గ్రేషియా కల్లు గీయుచు ప్రమాదవశాత్తు తాటి / ఈత చెట్టు పైనుండి పడి గాయపడిన లేదా మృతి చెందిన వారికి ఇవ్వబడును. 2014 సంవత్సరము నుండి డిసంబర్ 2019 వరకు 284 గీత కార్మికులకు 177.60 లక్షల రుపాయలను ఏక్స్ గ్రేషియా రూపములొ అందజేయడం జరిగింది.
- గుడుంబా ప్రభావిత కుటుంబాలకు పునరావాస పథకము:
మన జిల్లాలో గుడుంబా నిషేధము వల్ల ఉపాధి కోల్పోయిన (159) కుటుంబాలకు ఒక్కొక్కరికి (2) లక్షల చొప్పున మొత్తం 3 కోట్ల 18 లక్షలు మంజూరు చేసి వివిధ ఉపాదులు కల్పించడం జరిగింది.
- హరిత హారం : 2016 సంవత్సరము నుండి 2019 సంవత్సరము వరకు మొత్తం 26,45,000 ఈత / ఖర్జూర మొక్కలను ఈ.జి.యస్ / నాన్ ఈ.జి.యస్ పద్దతిలో జగిత్యాల జిల్లాలో నాటడం జరిగింది.