మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్
కార్యాలయం : అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖా
అడ్రస్ : రామాలయము దగ్గర , ధరూర్ క్యాంపు, జగిత్యాల
అధికారి : ఆర్. యస్. చిత్రు , డి. యం. డబ్లూ. ఓ సెల్ :9849796801
తెలంగాణా రాష్ట్ర అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖా యొక్క ఉద్దేశ్యము వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించి అల్ప సంఖ్యాక వర్గాల వారి జీవన ప్రమాణమును మెరుగుపరుచుచున్నది. జిల్లా మొత్తం జనాభా 9,88,913 మైనారిటీ మొత్తం జనాభా 81,934 ( 8.29 % )
వివిధ పథకాల యొక్క వివరణ:
- బ్యాంకుల ద్వారా ఋణములు: చదువుతో నిమిత్తము లేకుండా నిరుద్యోగులుగా ఉన్న వారికి అనుభవం, అవగాహనను బట్టి చిన్నతరహా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, కుటీర పరిశ్రమలు స్థాపించుకొనుటకు బ్యాంకుల ద్వారా (లేదా) నేరుగా ఆర్థిక సహాయముతో పాటు సబ్సిడి అందించబడుతున్నది. ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకొనుటకు వెబ్ సైట్ (www.tsobmms.cgg.gov.in) 2018-2019 వ ఆర్థిక సంవత్సరం: 2015-16 లో దరఖాస్తు చేసుకుని, మంజూరి కానీ మిగిలిన లబ్దిదారులకు ఈ సంవత్సరంలో ( 164 ) యూనిట్స్ కి సబ్సిడీ రూ 123.60 పంపిణి చేయడము జరిగింది.
క్రమ సంఖ్య |
రకము |
లక్ష్యం |
మంజూరు |
గ్రౌన్డింగ్ |
|||
Phy. |
Fin. |
Phy. |
Fin. |
Phy. |
Fin. |
||
1 |
కేటగిరి 1- A |
230 |
247.00 |
22 |
10.00 |
22 |
10.00 |
కేటగిరి 1- B |
151 |
120.80 |
142 |
113.60 |
|||
మొత్తం. |
|
|
173 |
130.80 |
164 |
123.60 |
- గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కీం:
2017- 18 & 2018-19 వ ఆర్థిక సంవత్సరం మజిద్ / గ్రేవియార్డ్ రేపైర్లకు మంజూరి అయిన పనుల వివరాలు
మజీద్ / గ్రేవీయార్డ్ రేపైర్లకు షాదిఖాన, కమ్యూనిటీ హాల్ కొరకు (69) పనులకు గాను 537.00 లక్షల అంచనాలతో పనులు మంజూరి అయినవి. ఇందులో ఇప్పటివరకు (33) పనులు రూ: 253.03 లక్షలు పనులు పుర్తికాబడినవి. మిగతా పనులు ప్రగతిలో ఉన్నవి.
ప్రభుత్వము నుండి రూ. 256.00 లక్షలు నిధులు విడుదల కావాల్సి ఉంది.
2017- 18 & 2018-19 వ ఆర్థిక సంవత్సరం చర్చి మరమత్హులకు మంజూరి అయిన పనుల వివరాలు :
చర్చి మరమ్మత్తులకు, కొరకు ( 104 ) పనులుకు 257.00 లక్షల అంచనాలతో పనులు మంజూరి అయినవి. ఇందులో ఇప్పటివరకు (31) పనులు రూ: 130.00 లక్షల నిధులు మంజూరు కాబడినవి. మిగతా పనులు ప్రగతిలో ఉన్నవి.
ప్రభుత్వము నుండి రూ . 127.00 లక్షలు నిధులు విడుదల కావాల్సి ఉంది.
III. ట్రైనింగ్
తెలంగాణా మైనారిటీ ఫైనాన్సు కార్పొరేషన్ ద్వార 2019-20 సం.నికై నిరుద్యోగ మైనారిటి యువతకై, ఉపాధి శిక్షణ కొరకై స్వయం ఉపాధి టైలరింగ్ కేటగిరి క్రింద ( 150 ), జ్యూట్ బ్యాగుల తయారి కేటగిరి క్రింద ( 100 ) మంజురి ఇవ్వబడినది, కోవిడ్ కారణముగా ఆగిపోయిన ఇట్టి శిక్షణ కార్యక్రమము తిరిగి ప్రారంభించబడినది.
IV.మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ (TMREIS) :
రాష్ట్ర ప్రభుత్వముచే మైనారిటీ విద్యార్థిని విద్యార్థులకు 2016-17 ఆర్థిక సంవత్సరం నుండి మైనారిటీ గురుకుల పారశాలలు మన జిల్లలో మొత్తం (05) గురుకులాలు మంజూరి అయినవి. అందులో బాలురు (03), బాలికలు (02) కలవు, 5, తరగతి నుండి 9, 10 వ తరగతి వరకు విద్యార్థులు విద్యనూ అభ్యసిస్తున్నారు.
అర్హతలు: 1) ఆదార్ కార్డు 2) వార్షిక ఆదాయము గ్రామీణ ప్రాంతములో నివసిస్తున్న వారికి రూ 1,50,000/-. నగర పంచాయితి మరియు పట్టణ ప్రాంతములో నివసిస్తున్న వారికి రూ.2,00,000/- కు మించరాదు.
2020-2021 వ విధ్యా సంవత్సరంలో (05) గురుకుల పారశాలలలో ( 2024 ) విద్యార్థులు అడ్మిషన్ పొందినారు. మంజూరి సీట్ల సంఖ్య ( 2400 ) , ఖాళీల సంఖ్య ( 376 ).
2020-2021 వ విధ్యా సంవత్సరంలో (02) గురుకుల జూనియర్ కాలేజీలు మంజూరి కాబడినవి 1) జగిత్యాల( బాలికలు ) 2) కోరుట్ల ( బాలురు ). ప్రస్తుతము కోవిడ్ – 19 కారణముగా, ప్రభుత్వము నుండి అనుమతి లభించిన తదుపరి తరగతులు ప్రారంభించబడును. (02) గురుకుల జూనియర్ కాలేజీలు (119) విద్యార్థులు అడ్మిషన్ పొందినారు, ప్రస్తుతము ఆన్లైన్ క్లాసులు నడుపబడుచున్నవి. మంజూరి సీట్ల సంఖ్య ( 160 ), ఖాళీల సంఖ్య ( 41 ), ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల చివరి తేది 15-11-2020.